![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -97 లో...... అమ్మాయి వాళ్ళు పెట్టిన కండిషన్ గురించి చక్రి, మహా ఇద్దరు కేశవ, కన్నాకి చెప్తారు. దాంతో కన్నా ఏడుస్తాడు. తనని నవ్వించడానికి కేశవని మహా కర్రతో కొట్టినట్లు యాక్టింగ్ చేస్తుంది. దాంతో కన్నా నవ్వుతాడు. నాకు అన్నయ్య పెళ్లి చేసుకోవడం ఇష్టమే.. అన్నయ్య లేకుండా అలవాటు చేసుకుంటానని కన్నా అంటాడు. హమ్మయ్య కన్నా ఒప్పుకున్నాడని చక్రి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఆ తర్వాత మహా వెళ్లి నారాయణతో మాట్లాడుతుంది. పెద్దికి సంబంధం ఫిక్స్ అయింది.. అమ్మాయి పెళ్లి అయ్యాక సపరేట్ గా ఉంటే పెళ్లికి ఒకే అంట అందుకే పెళ్లి ఫిక్స్ చేసాం ఇంట్లో అందరు ఒప్పుకున్నారని మహా అంటుంది. ఆ తర్వాత మాధవ ఇంటికి రాగానే తనతో పెళ్లి గురించి మాట్లాడుతారు కానీ కండిషన్ గురించి ఎవరు ఏం చెప్పరు.. చెప్తే ఎక్కడ మాధవ ఒప్పుకోడోనని ఎవరు ఆ టాపిక్ తియ్యరు.. అమ్మాయి ఒకే అంది అనగానే మాధవని కలిసినప్పుడు అమ్మయి పెట్టిన కండిషన్ గుర్తుచేసుకుంటాడు. అన్ని మాట్లాడారా అని మాధవ అడుగుతాడు. నువ్వు చేసిపెట్టె గారెల కోసం అయినా నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నదని చక్రి అంటాడు.
ఆ తర్వాత మాధవ కిచెన్ లోకి వెళ్లి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మహా వెళ్లి దేని గురించి ఆలోచిస్తున్నారని మాట్లాడుతుంది. నా పెళ్లి గురించి అని మాధవ అంటాడు. ఆ తర్వాత మాధవ వచ్చేసరికి కన్నా డల్ గా ఉంటాడు. ఏమైందని మాధవ అడుగుతాడు. మాధవ పెళ్లికి ఒప్పుకోవడం లేదని కన్నా డల్ గా ఉంటాడు. అలా అయినా ఒప్పుకుంటాడని అలా చేస్తాడు కన్నా. తరువాయి భాగంలో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తారు. కండిషన్ గురించి ఎవరు చెప్పొద్దని చక్రి వాళ్ళతో మహా అంటుంది. అప్పుడే పంతులు గారు కండిషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకోవాలని అంటాడు. అది విని మాధవ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |